డ్రాగా ముగిసిన సన్నాహక మ్యాచ్‌

Prajasakti

Prajasakti

Author 2019-09-28 02:41:44

డ్రాగా ముగిసిన సన్నాహక మ్యాచ్‌

- ప్రజాశక్తి, విజయనగరంటౌన్‌
విజయనగరంలోని చింతవలస పివిజిరాజు ఎసిఎ క్రికెట్‌ స్టేడియంలో ఇండియా బోర్డు ప్రెసిడెంట్‌ లెవెన్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన సన్నాహక మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. రెండురోజులు పాటు జరిగిన ఈ క్రికెట్‌ పోటీలు క్రీడాభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి. క్రికెట్‌ మ్యాచ్‌ను జిల్లానలుమూలల నుంచి వచ్చిన వందలాది మంది తిలకించారు. ఇండియా టీమ్‌ బ్యాటింగ్‌ శనివారం జరగడంతో అత్యధిక మంది మైదానానికి చేరుకున్నారు. దీంతో కొంతమందిని సెక్యూరిటీ లోపలకు అనుమతించలేదు. మరోవైపు మూడు రోజుల మ్యాచ్‌లో మొదటి రోజు వర్షం కురవడంతో రెండు రోజులు మాత్రమే ఆట సాగింది. మొదట బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 6 వికెట్లు నష్టానికి 279 పరుగులు చేయగా, ఆట చివరి రోజు శనివారం ఇండియా బోర్డు లెవన్‌ జట్టు నిర్ణీత సమాయానికి 64 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. ఇండియా ఎలెవెన్‌ జట్టులో శ్రీకర్‌భరత్‌ , ప్రియాంక్‌ పంచల్‌ , సిద్దేస్‌లాడ్‌ ఆఫ్‌ సెంచరీలు చేసి అలరించారు. సాయంత్రం ఐదు గంటలు సమయానికి 64 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఇండియా బోర్డు ఎలెవెన్‌ జట్టు 268 పరుగులు చేయగా ఆంపైర్లు 64వ ఓవర్‌ పూర్తయిన వెంటనే ఆటను ముగించారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD