డ్రింక్స్‌ బోయ్‌గా ఆస్ట్రేలియా ప్రధాని!

Newwaves

Newwaves

Author 2019-10-25 00:02:00

img

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌కు క్రికెట్ అంటే పిచ్చి అభిమానం. తాజాగా శ్రీలంక జట్టు ఆసీస్ పర్యటనకు రాగా.. సన్నాహాక మ్యాచ్‌గా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ జట్టుతో పోటీ నిర్వహించారు. కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్‌లో జరిగిన ఈ పోరులో ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ జట్టు వికెట్ తేడాతో నెగ్గింది. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆటగాళ్ల కంటే ఆసీస్ ప్రధాని స్కాట్ మోరిసన్ హైలైట్ అయ్యారు. శ్రీలంక జట్టు బ్యాటింగ్ చేస్తుండగా, ఫీల్డింగ్ చేస్తున్న ఆసీస్ ఆటగాళ్ల కోసం ఆయన డ్రింక్స్ మోసుకొచ్చారు. ఎంతో నిరాడంబరంగా డ్రింక్స్ కంటెయినర్ తీసుకువచ్చి ఆటగాళ్లకు అందించారు. అంతేకాదు.. ఫీల్డింగ్ చేస్తున్న ఆటగాళ్ల వద్దకు వెళ్లి వారిని ఉత్సాహపరిచడం అందరినీ ఆకట్టుకుంది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN