ఢిల్లీకి అశ్విన్‌ బదిలీ ప్రక్రియ పూర్తి

Prajasakti

Prajasakti

Author 2019-11-09 05:22:17

img

న్యూఢిల్లీ: రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇండియన్‌ ప్రిమియర్‌లీగ్‌(ఐపిఎల్‌)లో ఢిల్లీ క్యాపిటల్స్‌ పంచన చేరాడు. గత ఏడాది కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌కు సారథ్య బాధ్యతలు తీసుకున్నా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. దీంతో ఆ ఫ్రాంచేజీ అశ్విన్‌ వదులుకోవడానికి సిద్ధపడింది. ఢిల్లీ రూ.1.5 కోట్లకు సుచిత్‌ను పంజాబ్‌కు ఇచ్చేందుకు అంగీకరించడంతో ఈ బదిలీ ప్రక్రియ ముగిసింది. 2018లో అశ్విన్‌ను పంజాబ్‌ రూ.7.6 కోట్లకు కొనుగోలు చేసింది. అశ్విన్‌ చేరికపై ఢిల్లీ క్యాపిటల్స్‌ సహ యజమాని పార్థ్‌ జిందాల్‌ మాట్లాడుతూ... అశ్విన్‌ అత్యంత సీనియర్‌ స్పిన్నర్‌, బ్యాట్స్‌మన్‌. ఐపిఎల్‌లో అతనికి తిరుగులేని రికార్డు ఉంది. వచ్చే ఏడాది టైటిల్‌పై కన్నేసిన మాకు అశ్విన్‌ చేరిక అమిత ప్రయోజనం కలిగిస్తుందని అన్నాడు. అరుణ్‌ జైట్లీ మైదానంలో సగం మ్యాచ్‌లు జరగనున్న దృష్ట్యా.. తప్పక ఫలితాల్ని రాబడతామని జిందాల్‌ తెలిపారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD