తడబడిన భారత్…. బంగ్లా లక్ష్యం 149

Mana Telangana

Mana Telangana

Author 2019-11-03 23:29:05

img

న్యూఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు సాధించింది. దీంతో టీమిండియా, బంగ్లా జట్టుకు 149 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ(9) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరగా.. మరో ఓపెనర్ శిఖర్ ధవన్(41) రాణించాడు. బంగ్లా బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేయడంతో రిషబ్ పంత్(27), శ్రేయస్ అయ్యర్(22)లు భారీ స్కోరు సాధించడంలో విఫలమయ్యారు. ఇక, కెఎల్ రాహుల్(15), శివమ్ దూబే(1)లు తీవ్రంగా నిరాశపర్చారు. దీంతో 17 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 110 పరుగులు మాత్రమే చేసిన భారత్ కష్టాల్లో పడింది. చివర్లలో కృనాల్ పాండ్యా(15), వాషింగ్టన్ సుందర్(14)లు బ్యాట్ ఝుళిపించడంతో టీమిండియా ఆ మాత్రం స్కోరు చేసింది.

India Score 148/6 in 20 overs against Bangladesh

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD