తమిళం నా మాతృ భాష !

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-17 05:59:39

  • నెటిజన్‌కు మిథాలీ ఘాటు సమాధానం

హైదరాబాద్‌: ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌లో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న హైదరాబాద్‌ అమ్మాయి మిథాలీరాజ్‌..తాను తమిళం మరిచిపోయానన్న ఓ నెటిజన్‌కు ఘాటుగా సమాధానమిచ్చింది. ‘మిథాలీకి తమిళ భాష తెలీదు. ఆమె ఇంగ్లిష్‌, తెలుగు, హిందీలోనే మాట్లాడుతుంది’ అని అతడు ట్వీట్‌ చేశాడు. అయితే, ఆ నెటిజన్‌ విమర్శకు 36 ఏళ్ల మిథాలీ తనదైన రీతిలో బదులిచ్చింది. ‘నా మాతృభాష తమిళం. నాకు తమిళంలో మాట్లాడడం బాగా వచ్చు. తమిళనాడులో నివసించినందుకు గర్వపడుతున్నా’ అని ఆమె తమిళంలో ట్వీట్‌ చేయడం ద్వారా సదరు నెటిజన్‌ నోరు మూయించింది. అంతేకాదు ‘అన్నింటికన్నా నేను భారతీయురాలైనందుకు గర్విస్తున్నా. తరచూ నాపై నీవు చేస్తున్న విమర్శలు, నేను ఏంచేయాలో సూచిస్తూ ఎప్పటికప్పుడు నీవు ఇస్తున్న సలహాలు నన్ను నేను మరింత మెరుగుపరుచుకొనేందుకు తోడ్పడుతున్నాయి’ అని అమెరికన్‌ సింగర్‌ టేలర్‌ స్విఫ్ట్‌ పాడిన ‘కామ్‌ డౌన్‌’ అన్న పాటను కూడా మిథాలీ ట్వీట్‌ చేసింది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD