తమిళనాడు X కర్ణాటక

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-24 03:07:00

img

బెంగళూరు: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో కర్ణాటక, తమిళనాడు జట్లు ఫైనల్‌కు చేరాయి. బుధవారం జరిగిన సెమీఫైనల్స్‌లో ఛత్తీస్‌గఢ్‌పై 9 వికెట్ల తేడాతో కర్ణాటక.. గుజరాత్‌పై 5 వికెట్ల తేడాతో తమిళనాడు విజయాలు సాధించి తుదిపోరుకు అర్హత సాధించాయి. కర్ణాటకతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఛత్తీస్‌గఢ్‌ 49.4 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. అమన్‌దీప్‌ ఖరే (78) అర్ధశతకం సాధించాడు. అనంతరం లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ లోకేశ్‌ రాహుల్‌ (88 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌), మయాంక్‌ అగర్వాల్‌ (47 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్సర్లు)తో పాటు దేవదత్‌ పడిక్కల్‌ (92) మెరువడంతో కర్ణాటక కేవలం ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి 40 ఓవర్లలో 229 పరుగులు చేసింది. వర్షం కారణంగా 40 ఓవర్లకు కుదించిన మరో సెమీస్‌లో గుజరాత్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 177 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో తమిళనాడు కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (47)తో పాటు షారుక్‌ ఖాన్‌ (56) రాణించడంతో ఆ జట్టు మరో ఓవర్‌ మిగిలుండగానే 5 వికెట్లకు 181 పరుగులు చేసి నెగ్గింది. శుక్రవారం జరుగనున్న ఫైనల్లో తమిళనాడు, కర్ణాటక తలపడనున్నాయి.
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD