తమీమ్ స్థానంలో కయేస్
ఢాకా: భారత్‌తో త్వరలో మొదలయ్యే పర్యటనకు బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ దూరమయ్యాడు. తమీమ్ భార్య రెండో సంతానానికి జన్మనివ్వబోతున్నందున అతను భారత పర్యటన నుంచి తప్పుకున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు శనివారం ఒక ప్రకటనలో పే ర్కొంది. తమీమ్‌కు బదులుగా ఇమ్రూస్ కయేస్ను బీసీబీ ఎంపిక చేసింది. టీ20 సిరీస్‌కు ఎంపికైన తమీమ్ ప్రస్తుతం పక్కటెముకల గాయంతో బాధపడుతున్నాడు. దీనికి తోడు అతని భార్య ప్రసవానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో టీ20 సిరీస్‌తో పాటు కోల్‌కతాలో జరిగే రెండో టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు అని చీఫ్ సెలెక్టర్ అబెదిన్ అన్నాడు