తిరువీధులలో శ్రీవారి ఊరేగింపు
వనస్థలిపురం, అక్టోబర్ 7: వనస్థలిపురం సచివాలయ నగర్ కాలనీలోని శ్రీపద్మావతి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి.సోమవారం ఉదయం మంగళ వాయుద్యాలు, సుప్రభాత సేవ, తిరువరాధన సహస్రనామర్చన, సువర్ణ పుష్పార్చన, భాలభోగ నివేదన, తీర్థ ప్రసాద గోష్ఠి, ఉత్సవ మూర్తులకు అభిషేకం, అన్నదాన కార్యక్రమం, శ్రీవారి కల్యాణ మహోత్సవం, తిరు వీధులలో ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్ రెడ్డి దంపతులు హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ కే.లక్ష్మయ్య, కార్యదర్శి మురళీధర్, రాజ్యలక్ష్మీ, సుధాకర్ రెడ్డి ఏర్పాట్లను చేపట్టారు.