తుది పోరుకు రైల్వేస్‌, బెంగాల్‌ జట్లు

Prajasakti

Prajasakti

Author 2019-11-09 03:45:59

img

ప్రజాశక్తి - విజయవాడ అర్బన్‌
సీనియర్‌ ఉమెన్‌ టీ -20 లీగ్‌ కమ్‌ నాకౌట్‌ టోర్నమెంట్‌లో భాగంగా రైల్వేస్‌, బెంగాల్‌ జట్లు ఫైనల్స్‌కు చేరుకున్నాయి. మూలపాడులోని డాక్టర్‌ గోకరాజు లైలా గంగరాజు ఎసిఎ క్రికెట్‌ కాంప్లెక్స్‌ నందు శుక్రవారం సెమి ఫైనల్స్‌ మ్యాచ్‌లు జరిగాయి ఈమ్యాచ్‌లో రైల్వేస్‌, బెంగాల్‌ జట్టు ఫైనల్స్‌కు అర్హత సాధించాయి.
ఆరు వికెట్లతో బెంగాల్‌ విజయం ...
ఉదయం జరిగిన తొలి సెమి ఫైనల్స్‌ మ్యాచ్‌లో బెంగాల్‌ - బరోడా జట్ల మధ్య జరిగింది. ఈమ్యాచ్‌లో తొలుత 20 ఓవర్లలో బరోడా జట్టు 9 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. జట్టులోని యస్‌తిక 22, పరుగులు చేయగా బెంగాల్‌ జట్టు బౌలర్లు సుల్తానా 21 పరుగులిచ్చి రెండు వికెట్లు, మితా పాల్‌ 17 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నారు. అనంతరం బెంగాల్‌ జట్టు 89 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగి 18.4 ఓవర్లలోనే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 92 పరుగులు చేసి విజయం సాధించింది. జట్టులోని ఓపెనింగ్‌ బ్యాట్స్‌ఉమెన్‌ మందిర 27 పరుగులు చేయగా , పరమిత 26 పరుగులుచేశారు. బరోడా జట్టు బౌలర్‌ జయ 13 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నారు.
విదర్భపై రైల్వేస్‌ ఘన విజయం...
మరో మ్యాచ్‌ విదర్భ - రైల్వేస్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రైల్వేస్‌ జట్టు 75 పరుగుల ఆధిక్యతతో విజయం సాధించింది. ఈమ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రైల్వేస్‌ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. జట్టులోని ఒపెనింగ్‌ బ్యాట్స్‌ఉమెన్‌ రోజారియో 66, మోనా 22 పరుగులు చేయగా విదర్భ జట్టు బౌలర్లు నోపూర్‌ 11 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకున్నారు. అనంతరం విదర్భ జట్టు 140 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగి 18.1 ఓవర్లలో 64 పరుగులుమాత్రమే చేసి ఓటమి చెందింది. ఈనెల 10వ తేదీన ఫైనల్స్‌ మ్యాచ్‌ ఉదయం 10 గంటలకు మూలపాడులోని ఎసిఎ స్టేడియం నందు జరుగనుంది.

img
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD