తొలిసారి సచిన్‌ ఎంపికవలేదట!

Newwaves

Newwaves

Author 2019-10-26 00:20:00

img

ముంబై: క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా తొలిసారిగా సెలక్షన్స్‌కు వెళ్ళినప్పుడు ఎంపికవలేదట. ఈ విషయం సచినే స్వయంగా వెల్లడించాడు.

సచిన్ టెండూల్కర్ తన చిన్ననాటి జ్ఞాపకాలను విద్యార్థులతో పంచుకున్నారు. పదకొండేళ్ల వయసులో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్న తర్వాత తొలిసారి పాల్గొన్న సెలెక్షన్స్‌లో తనకు నిరాశ తప్పలేదని వెల్లడించాడు. సెలెక్షన్స్‌లో పాల్గొన్న తనను తిరస్కరించారని గుర్తుచేసుకున్నాడు. ఆ సమయంలో భారత జట్టుకు ఆడాలన్న ధ్యేయం ఒక్కటే తన మనసులో ఉందని, అప్పుడు తాను విద్యార్థిగా ఉన్నానని తెలిపాడు. ఆటను మరింత మెరుగు పర్చుకోవాలని, మరింత హార్డ్‌వర్క్ చేయాలని సెలెక్టర్లు తనకు సూచించారని సచిన్ చెప్పాడు.

అయితే.. సెలెక్షన్స్‌లో తొలిసారిగా ఎదురైన అనుభవం తనలో మరింత పట్టుదల పెంచిందని, ఆటలో మరింతగా శ్రమించాలన్న దృఢసంకల్పం కలిగిందని తెలిపారు. అప్పటి నుంచి కఠోరశ్రమతో ఆటపరంగా ఎంతో ఎదిగానని, ఎవరూ షార్ట్ కట్‌లతో ఉన్నత స్థానానికి చేరలేరని సచిన్ పేర్కొన్నాడు. ముంబైఃలోని లేట్ లక్ష్మణ్‌రావు దూరే పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్థులతో ముఖాముఖీ మాట్లాడుతూ సచిన్ ఈ విషయాలు తెలిపాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN