తొలి టీ20లో పాక్‌కు లంక షాక్‌

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-06 05:21:33

లాహోర్‌: యువకులతో కూడిన శ్రీలంక జట్టు తొలి టీ20లో పాకిస్థాన్‌కు షాకిచ్చింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్‌ 64 రన్స్‌ తేడాతో చిత్తయింది. 166 పరుగుల ఛేదనలో పాక్‌ 17.4 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. ఇఫ్తికార్‌ అహ్మద్‌ (25), సర్ఫ్‌రాజ్‌ అహ్మద్‌ (24), బాబర్‌ ఆజమ్‌ (13) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఉడానా (3/11), నువాన్‌ ప్రదీప్‌ (3/21) చెరి మూడు, హసరంగ (2/20) రెండు వికెట్లు తీశారు. అంతకుముందు శ్రీలంక 20 ఓవర్లలో 165/5 స్కోరు చేసింది. గుణతిలక (57), ఫెర్నాండో (33), రాజపక్స (32) రాణించారు. పాక్‌ పేసర్‌ మహ్మద్‌ హస్‌నైన్‌ (3/37) హ్యాట్రిక్‌ తీసి.. టీ20ల్లో ఈ ఘనత సాధించిన పిన్న వయసు (19 ఏళ్ల 183 రోజులు) క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN