తొలి టీ20లో పాక్‌ పరాజయం

Prajasakti

Prajasakti

Author 2019-10-06 07:30:12

img

లాహోర్‌: శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో పాకిస్తాన్‌ పరాజయం పాలైంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 64 పరుగుల తేడాతో శ్రీలంక చేతిలో ఓడింది. టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. గుణతిలక(57), ఫెర్నాండో(33) తొలి వికెట్‌కు 9.4 ఓవర్లలో 84 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్‌ జట్టు 17.4 ఓవర్లలో 101 పరుగులకు కుప్పకూలింది. ప్రదీప్‌, ఉదానకు మూడేసి వికెట్లు దక్కాయి. రెండో టీ20 సోమవారం జరగనుంది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN