తొలి టెస్టుకు భారత జట్టిదే…

Amaravatinews

Amaravatinews

Author 2019-10-01 16:53:13

img

Share this on WhatsApp

విశాఖపట్నం: సౌతాఫ్రికాతో తొలి టెస్టులో తలపడే భారత జట్టును బీసీసీఐ ఇవాళ ప్రకటించింది. ఊహించినట్లుగానే యువ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌పై వేటు పడింది. గత సిరీస్‌ల్లో బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమవుతుండటంతో అతనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో గాయం నుంచి సీనియర్‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ వృద్ధిమాన్‌ సాహా పూర్తిగా కోలుకొని ఫిట్‌నెస్‌ సాధించడంతో పంత్‌ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. సాహా చివరిసారిగా 2018 జనవరిలో సౌతాఫ్రికా టూర్‌లో టెస్టు మ్యాచ్‌ ఆడాడు. కెరీర్‌లో ఇప్పటి వరకు 32 టెస్టులాడిన సాహా 30.63 సగటుతో 1164 పరుగులు చేశాడు.

మరోవైపు సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ కూడా తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. మహాత్మా గాంధీ-నెల్సన్‌ మండేలా ఫ్రీడమ్‌ ట్రోఫీలో భాగంగా మూడు టెస్టుల సిరీస్‌లో భారత్‌, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. బుధవారం విశాఖ వేదికగా భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు ఆరంభం కానుంది.

భారత జట్టు: విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రహానె(వైస్‌ కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌, ఛెతేశ్వర్‌ పుజారా, హనుమ విహారి, అశ్విన్‌, రవీంద్ర జడేజా, వృద్ధిమాన్‌ సాహా, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమీ.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN