తొలుత ఎంపిక కాలేదు

Nava Telangana

Nava Telangana

Author 2019-10-26 03:09:56

- క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌
ముంబయి : వన్డేల్లో 18426 పరుగులు, టెస్టుల్లో 15921 పరుగులు చేసి క్రికెట్‌ రికార్డులను తన పేరిట లిఖించుకున్న దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌. పిన్న వయసులోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సచిన్‌ టెండూల్కర్‌ సైతం ఆరంభంలో తిరస్కరణకు గురయ్యాడట. తొలి సెలక్షన్‌ ట్రయల్స్‌లో సెలక్టర్లు తనను తిరస్కరించినట్టు మాస్టర్‌ బ్లాస్టర్‌ వెల్లడించాడు. ' నేను విద్యార్థిగా ఉన్న సమయంలో నా మదిలో ఒకే విషయం మెదిలేది. భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాలి. అందుకోసం నా ప్రయాణం పదకొండేండ్లలోనే మొదలైంది. నాకు ఇంకా గుర్తుంది. తొలుత సెలక్షన్‌కు వెళ్లినప్పుడు, సెలక్టర్లు నన్ను ఎంపిక చేయలేదు. ఆటను మెరుగుపర్చుకునేందుకు మరింత కష్టపడమని చెప్పారు. ఆ సమయంలో నిరుత్సాహానికి గురయ్యాను. నేను బాగానే ఆడానని నా భావన. ఫలితం నేను ఆశించినట్టు లేదు. కానీ ఈ తర్వాత నా ఫోకస్‌, పట్టుదల, శ్రమించేతత్వం మరింత పెరిగాయి. కలలు సాకారం చేసుకోవాలంటే, దొడ్డి దారితో ఉపయోగం ఉండదు' అని సచిన్‌ టెండూల్కర్‌ పేర్కొన్నాడు. రాజ్యసభ్య ఎంపీగా ఉన్న సమయంలో మంజూరు చేసిన నిధులతో పశ్చిమ ముంబయిలోని లక్ష్మన్‌రావు దురె పాఠశాలలో నూతనంగా నిర్మించిన మూడు తరగతి గదులు, సాంస్కృతిక కార్యక్రమాలకు ఓ వేదికను సచిన్‌ టెండూల్కర్‌ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్ధులను ఉద్దేశించి సచిన్‌ మాట్లాడారు.

img
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD