దక్షిణాఫ్రికాపై అమ్మాయిల గెలుపు

Prajasakti

Prajasakti

Author 2019-10-10 08:11:13

img

- తొలివన్డేలో ఎనిమిది వికెట్లతో విజయం
వడోదర : దక్షిణాఫ్రికా మహిళలతో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బుధవారంనుంచి ప్రారంభమైన మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో ఓపెనర్‌ ప్రియా పూనియా(75నాటౌట్‌), రోడ్రిగ్స్‌(55) కదం తొక్కడంతో 8 వికెట్ల తేడాతో గెలిచింది. అంతకుముందు టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్‌ లూస్‌ తొలిగా బ్యాటింగ్‌ను ఎంచుకున్నా... భారత బౌలర్లు జులన్‌ గోస్వామి(3/33), శిఖా పాండే(2/38), ఏక్తా బిస్ట్‌(2/28), పూనమ్‌ యాదవ్‌(2/33) చెలరేగడంతో 45.1 ఓవర్లలో 164 పరుగులకే కుప్పకూలింది. సఫారీ జట్టులో మారిజానే(54), లూరా(39), లూస్‌(22) మాత్రమే రాణించారు. అనంతరం మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ప్రియా పూనియా, రోడ్రిగ్స్‌ రాణించగా.. పూనమ్‌ రౌత్‌(16) నిరాశపర్చింది. ఆ తర్వాత కెప్టెన్‌ మిథాలీరాజ్‌(11) జాగ్రత్తగా ఆడటంతో 41.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 165 పరుగులు లక్ష్యాన్ని భారత్‌ ఛేదించగల్గింది. మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా మహిళల జట్టు 1-0 ఆధిక్యతలో నిలవగా.. అక్టోబర్‌ 11, 14న రెండు, మూడు వన్డేలు ఇదే వేదికపై జరగనున్నాయి.
మంధానకు గాయం
టీమిండియా ఓపెనర్‌ స్మృతి మంధాన బొటన వేలి గాయం కారణంగా దక్షిణాఫ్రికా సిరీస్‌ నుంచి తప్పు కుంది. మంగళవారం ప్రాక్టీస్‌లో భాగంగా ఈ క్రికెటర్‌ బొటన వేలికి గాయమైంది. వైద్య పరీక్షల అనంతరం మంధానకు విశ్రాంతి అవసరవని డాక్టర్లు తెలిపారు. దీంతో ఆమె స్థానంలో బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ పూజా వస్త్రాకర్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. మంధాన గాయం కారణంగా దూరం కావడంతో బ్యాటింగ్‌ భారం మిథాలీ రాజ్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌లపైనే పడనుంది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD