దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ : .. హిట్‌మ్యాన్‌ విఫలం …

Navyamedia

Navyamedia

Author 2019-09-28 15:11:58

img

ఓపెనర్‌గా సత్తాచాటాలని భావించిన హిట్‌మ్యాన్‌ విఫలమయ్యాడు. బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌, సౌతాఫ్రికా మధ్య జరిగిన మూడు రోజుల సన్నాహక మ్యాచ్‌లో కేవలం రెండు బంతులు మాత్రమే ఎదుర్కొని డక్ ఔట్ అయ్యాడు. మూడు రోజుల ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఆట ముగిసేసమయానికి బోర్డు ఎలెవన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 64 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. ఎలెవన్‌ ఇన్నింగ్స్‌లో ప్రియాంక్‌ పాంచల్‌ 60 పరుగులు చేయగా.. శ్రీకర్‌ భరత్‌ 71 పరుగుల చేశాడు. ఇక సిద్దేశ్‌ లాడ్‌ 52 పరుగులు చేశాడు. అయితే వామప్‌ మ్యాచ్‌లో ఓపెనర్‌గా రోహిత్ బరిలో దిగారు.

అందరూ రోహిత్ శర్మ పరుగుల వరద పారిస్తారనుకున్నారు. కానీ కేవలం రెండు బంతులే ఆడి.. డకౌట్‌గా వెనుదిరిగాడు. ఫిలాండర్‌ బౌలింగ్‌లో కీపర్‌ క్లాసెన్‌కు క్యాచ్‌ ఇచ్చి రోహిత్‌ నిష్క్రమించాడు. అయితే అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో బావుమా 87 పరుగులు చేసి నాటౌట్‌గా నిలచాడు. ఇఖ ఫిలాండర్‌ 48 పరుగులు చేశాడు. వీరి దూకుడుతో 64 ఓవర్లలో 6 వికెట్లకు సౌతాఫ్రికా 279 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.



READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD