దాదాతో కోహ్లీ, రోహిత్ భేటీ

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-25 06:04:00

img
ముంబై: బీసీసీఐ నూతన అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని భారత నాయక ద్వయం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గురువారం కలుసుకుంది. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లకు జట్టు ఎంపిక సందర్భంగా వీరంతా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశ క్రికెట్ రోడ్‌మ్యాప్ గురించి వీరు చర్చించారు. దీనికి తోడు సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ భవితవ్యంపై చర్చకు వచ్చినా ఎవరూ మాట్లాడలేదని తెలిసింది. గంగూలీతో పాటు కార్యదర్శి జై షా, సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ పాల్గొన్న ఈ భేటీకి చీఫ్ కోచ్ రవిశాస్త్రి రాలేదు. సమావేశానికి సంబంధించిన ఫొటోను బీసీసీఐ సోషల్‌మీడియాలో షేర్ చేసింది. టీమ్‌ఇండియా కెప్టెన్, వైస్ కెప్టెన్‌ను అధ్యక్షుడు, కార్యదర్శి కలువాలనుకున్నారు. దేశ క్రికెట్ రోడ్‌మ్యాప్‌నకు సంబంధించి చర్చ జరిగింది. అధ్యక్ష హోదాలో గంగూలీ సలహాలు, సూచనలు చేశారు అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. విరామం లేకుండా వరుస సిరీస్‌లు ఆడుతున్న కోహ్లీకి విశ్రాంతినిచ్చిన సెలెక్షన్ కమిటీ.. రోహిత్‌శర్మకు టీ20ల కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD