దాదా అధ్యక్షుడై ఉంటే..నాకు మంచి జరిగేది: యువీ

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-20 06:33:14

img

న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్ష పీఠాన్ని అధిష్టించనున్న సౌరవ్‌ గంగూలీకి టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ శుభాకాంక్షలు తెలిపాడు. యో-యో టెస్ట్‌ను తప్పనిసరి చేసిన సమయంలో గంగూలీ బోర్డు ప్రెసిడెంట్‌గా ఉండుంటే తనకు మంచి జరిగేదని సరదాగా వ్యాఖ్యానించాడు. ఈ ఏడాది జూన్‌లో యువీ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. యో-యో టెస్ట్‌లో తాను పాసైనా బీసీసీఐ ముందుగా చెప్పినట్టు వీడ్కోలు మ్యాచ్‌కు తనకు అవకాశం కల్పించలేదని యువరాజ్‌ అన్నాడు. ‘భారత జట్టు గొప్ప కెప్టెన్‌ నుంచి.. బీసీసీఐ అధ్యక్షుడిగా గొప్ప ప్రయాణం. క్రికెటరే పాలనా బాధ్యతలు చేపట్టడం అద్భుతం. ఆటగాడి దృక్కోణాన్ని ఇతరులకు వివరించే వీలుంటుంది. యో-యో పరీక్ష ప్రవేశపెట్టినప్పుడు దాదా అధ్యక్షుడిగా ఉంటే బాగుండేద’ని యువీ ట్వీట్‌ చేశాడు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD