దాదా కోర్టులో బంతి

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-11-05 05:00:00

img

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చే సీజన్‌లో ఆటగాళ్ల సబ్‌స్టిట్యూషన్ కోసం పవర్ ప్లేయర్ నిబంధనను ప్రవేశపెట్టాలని టోర్నీ పాలనా కమిటీ నిర్ణయించింది. ముంబైలో బుధవారం సమావేశమైన కమిటీ ఈ మేరకు తీర్మానం చేయగా.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ విషయంపై తుదినిర్ణయం తీసుకోవాల్సి ఉంది.పవర్ ప్లేయర్ నిబంధన ప్రకారం... తుదిజట్టులో లేని ఆటగాడు వికెట్ పడిన సమయంలో బ్యాటింగ్‌కు రావొచ్చు. అలాగే ఏ సమయంలోనైనా తుదిజట్టులో లేని బౌలర్ మైదానంలో అడుగుపెట్టే సదుపాయం ఉంటుంది. తుది నిర్ణయం బీసీసీఐ అధ్యక్షుడే తీసుకోవాలి. ఐపీఎల్ కమిటీతో పాటు బోర్డు ఆఫీస్ బేరర్లందరితో ఆయన ఈ విషయంపై చర్చిస్తారు. అయితే ఈ నిబంధనను ప్రవేశపెట్టేందుకు చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి చెప్పారు. అయితే సీనియర్ ప్లేయర్లు ఎక్కువగా ఉన్న ఓ జట్టు కోసమే ఐపీఎల్ కమిటీ ఈ నిబంధనను తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నదని బీసీసీఐలోని ఓ వర్గం భావిస్తున్నట్టు సమాచారం. అలాగే ఈ సబ్‌స్టిట్యూట్ నిబంధన వల్ల క్రికెట్ స్వరూపం మారిపోతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి గంగూలీ ఈ నిబంధనకు మద్దతిస్తాడో లేదో చూడాలి.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD