దాదా మంచి ఇన్నింగ్స్ ఆడుతాడు

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-18 06:06:00

-గంగూలీకి బీసీసీఐ అధ్యక్ష పదవిపై సచిన్ స్పందన
img
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ మంచి ఇన్నింగ్స్ ఆడుతాడని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆశాభావం వ్యక్తంచేశాడు. కెరీర్‌లో ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్‌లు ఆడిన బెంగాలీ బాబు బీసీసీఐ ప్రెసిడెంట్‌గాను తనదైన ముద్రవేస్తాడని సచిన్ పేర్కొన్నాడు. దాదా గురించి నాకు బాగా తెలుసు. ఆటగాడిగా అతడు ఎలాంటి ఇన్నింగ్స్‌లు ఆడాడో.. ఇకపై (బీసీసీఐ అధ్యక్షుడిగా) కూడా అలాగే ముందుకు సాగుతాడనుకుంటున్నా. దేశానికి సేవ చేయడంలో అతడు వెనకడుగు వేయడు. అదే కసి, దూరదృష్టితో నిర్ణయాలు తీసుకుంటాడని ఆశిస్తున్నా అని మాస్టర్ అన్నాడు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో బీసీసీఐ నయా అధ్యక్షుడిపై సచిన్ టెండూల్కర్ తన అభి ప్రాయాలను వెల్లడించాడు. ఈ కార్య క్రమంలో మాస్టర్‌తో పాటు బ్రియన్ లారా, బ్రెట్‌లీ, జాంటీరోడ్స్, వీరేంద్ర సెహ్వాగ్ తదితరులు పాల్గొన్నారు.

ఒకప్పటి విండీస్‌లా: లారా

ప్రస్తుత టీమ్‌ఇండియా బౌలింగ్ దళం.. ఒకప్పటి వెస్టిండీస్ బృందాన్ని తలపిస్తున్నదని బ్యాటింగ్ దిగ్గజం బ్రియన్ లారా పేర్కొన్నాడు. ఒకప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరీబియన్ బౌలర్లకు ప్రస్తుత భారత బౌలర్లు ఏమాత్రం తీసిపోరని కొనియాడాడు. టీమ్‌ఇండియా పేసర్లు అదరగొడుతున్నారు. ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో వారి ప్రదర్శన అద్భుతం. 80, 90 దశకాల్లో విండీస్ పేస్ బలంగా ఉండేది. ప్రస్తుతం బుమ్రా, షమీ, ఇషాం త్, ఉమేశ్, భువనేశ్వర్‌తో కూడిన భారత్ బౌలింగ్ అందుకు తక్కువేమి కాదు అని అన్నాడు. రికార్డుల రారాజు విరాట్ కోహ్లీని కూడా లారా ప్రశంసలతో ముంచెత్తాడు. అతడు (కోహ్లీ) అత్యుత్తమ కెప్టెన్. ధోనీ నీడ నుంచి త్వరగానే బయటకొచ్చిన విరాట్.. జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ప్రస్తుతం భారత క్రికెట్ సరైన దిశలో పయనిస్తున్నది అని చెప్పుకొచ్చాడు.
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN