దాదా సీఎం అవుతాడు!

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-29 06:19:35

న్యూఢిల్లీ: సౌరవ్‌ గంగూలీకి రెండు కీలకమైన పదవులు లభిస్తాయని తాను ఊహించానని, అందులో ఒకటి నిజమైందని..రెండోది కూడా దక్కుతుందన్న నమ్మకముందని మాజీ ఓపెనర్‌ సెహ్వాగ్‌ చెప్పాడు. సౌరవ్‌ బీసీసీఐ అధ్యక్షుడు అవుతాడని తనతోపాటు మరికొందరు టీమిండియా సభ్యులు 2007లోనే ఊహించామని వెల్లడించాడు. అది ప్రస్తుతం నిజమైందన్నాడు. ఇక తాను ఊహిస్తున్న రెండో పదవి గంగూలీ..పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి కావడమన్నాడు. ఈ సందర్భంగా 2007లో సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న సంభాషణను వీరూ గుర్తు చేసుకున్నాడు. ‘అది కేప్‌టౌన్‌లో జరిగిన మూడో టెస్ట్‌. నేను, వసీం జాఫర్‌ త్వరగా అవుటయ్యాం. నాలుగో నెంబర్‌లో సచిన్‌ బదులు సౌరవ్‌ బరిలోకి దిగాడు. అది అతడికి పునరాగమన సిరీస్‌. సహజంగా ఎంతో ఒత్తిడి ఉంటుంది. కానీ ఒత్తిడిని అధిగమించి అద్భుతమైన బ్యాటింగ్‌ చేయడం ద్వారా అది తనకే సాధ్యమవుతుందని గంగూలీ నిరూపించాడు. ఆరోజు డ్రెస్సింగ్‌ రూమ్‌లో చర్చ జరిగింది. మాలో ఎవరికైనా బీసీసీఐ చీఫ్‌ కాగల సత్తా ఉందంటే అది దాదాకేనని మేమంతా ముక్తకంఠంతో అంగీకరించాం. అంతేకాదు..అతడు పశ్చిమబెంగాల్‌ సీఎం అవుతాడని కూడా నేను చెప్పా. నా భవిష్యవాణిలో ఒకటి నిజమైంది. మరొకటి బాకీ ఉంది’ అని 41 ఏళ్ల సెహ్వాగ్‌ ట్వీట్‌ చేశాడు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD