దీపావళి పోస్ట్.. రోహిత్ శర్మపై నెటిజన్ల విమర్శల వర్షం

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-28 20:59:22

img

ముంబై: భారత దేశ వ్యాప్తంగా ఆదివారం దీపావళి పండుగ సంబరాలు అంబరాన్ని తాకాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రతీ ఇంటా దీపాలు వెలిగించి.. ఈ పండుగను ఘనంగా జరుపుకున్నారు. అయితే ఈ పండుగ సందర్భంగా టీం ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ చేసిన ఓ ట్వీట్ అతన్ని చిక్కుల్లోపడేసింది. వాయు కాలుష్యం.. వీధి కుక్కలను దృష్టిలో పెట్టుకొని దీపావళీ పండుగను టపాసులు లేకుండా జరుపుకోవాలనే చర్చ ప్రతీసారి తెరమీదకు వస్తుంది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతాయి. కొందరు దీనికి మద్దతు ఇవ్వగా.. మరి కొందరు మాత్రం కేవలం దీపావళి సమయంలోనే మీకు కాలుష్యం గుర్తొస్తుందా అంటూ వ్యతిరేకిస్తారు.

అయితే రోహిత్ శర్మ దీనిపై తాజాగా చేసిన ట్వీట్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. దీపావళి రోజు టపాసులు కాల్చడంతో వీధి కుక్కలు ఎంతో భయానికి గురవుతున్నాయని.. వాటిని అలా చూడటం చాలా బాధించిందని రోహిత్ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ‘‘నా తోటి భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మీ జీవితాల్లో మరిన్ని వెలుగులు నింపాలని కోరుతున్నాను. ఈ దీపావళికి దీపాలు వెలిగించుదాం. టపాసులు కాల్చే ముందు ఈ అమాయక ప్రాణులను దృష్టిలో పెట్టుకుందాం. అవి భయపడుతుంటే చూడటం బాధగా ఉంది’’ అంటూ రోహిత్ ఓ కుక్క భయపడుతున్న వీడియోని షేర్ చేశాడు.

దీనిపై విమర్శలు వస్తున్నాయి. రోహిత్ 2010లో టపాసులు కాల్చుతూ దీపావలి ఎంజాయ్ చేశాను అంటూ చేసిన ట్వీట్‌ని నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ‘‘ఈసారి కుక్కకి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చారా?? మరి న్యూ ఇయర్ అప్పుడు కుక్క ఇయర్ బడ్స్ పెట్టుకుంటుందా??’’ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

మరిన్ని విమర్శలు:

ఇండియా మ్యాచ్ గెలిస్తే.. దీపావళి కంటే ఎక్కువ టపాసులు కాలుస్తారు? కానీ, మీకు దీపావళి అప్పుడే జ్ఞానం వస్తుందా??

ఐదు నెలల క్రితం నువ్వు ఇదే టపాసులు ఎంజాయ్ చేశావు?? గుర్తు తెచ్చుకో

నువ్వు ఐపీఎల్ ఆడకు. అందులోని ఈవెంట్లలో ఇంకా ఎక్కువ టపాసులు కాలుస్తారు.

అన్నా.. నువ్వు ఐపీఎల్‌లో గెలిచినప్పుడు ఆకాశాన్ని చూడవా?

ఈ సలహా బీసీసీఐకి ఇవ్వు.. అంతేకానీ, ఇలా పోస్ట్ చేయడం మానేయి.

అన్నా, ఐపీఎల్ ఆడటం ఎప్పుడు మానేస్తున్నావు మరీ?

ఇలా ఎవరికి తోచిన విధంగా సోషల్‌మీడియాలో నెటిజన్లు రోహిత్ ఆటాడుకుంటున్నారు. రోహిత్‌‌ని కపట నాటకాలు ఆడవద్దు అంటూ.. వాళ్లు కామెంట్ చేస్తున్నారు. కాగా, సౌతాఫ్రికా సిరీస్‌ని విజయవంతంగా ముగించుకున్న టీం ఇండియా ఆ తర్వాత బంగ్లాదేశ్ జట్టుతో తలపడనుంది. మూడు టీ-20ల సిరీస్‌లో విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చి.. రోహిత్ శర్మకు బీసీసీఐ సారథ్య బాధ్యతలు అప్పగించింది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN