ద్యూతి నయా రికార్డు

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-12 06:42:45

img

రాంచీ: భారత స్టార్‌ స్ర్పింటర్‌ ద్యూతీ చంద్‌ రాంచీలో జరుగుతున్న జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల రేసును 11.22 సెకన్లలో పూర్తి చేసి కెరీర్‌ బెస్ట్‌ టైమింగ్‌ను నమోదు చేసింది. శుక్రవారం ఇక్కడ జరిగిన సెమీఫైనల్‌ రేసులో ఆమె ఈ రికార్డు నెలకొల్పింది. ఫైనల్‌ను 11.25 సెకన్లలో పూర్తి చేసి పసిడి పతకం సొంతం చేసుకుంది. తాజా ప్రదర్శనతో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆసియా చాంపియన్‌షి్‌పలో తానే నెలకొల్పిన రికార్డు (11.26 సెకన్లు)ను ద్యూతి తిరగరాసింది. ఇటీవల దోహాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షి్‌పలో పేలవ ప్రదర్శనతో ద్యూతి హీట్స్‌లోనే వెనుదిరిగిన విషయం తెలిసిందే.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD