ధోని మళ్ళీ జట్టులోకి రావాలంటే..!! 

Ntvtelugu

Ntvtelugu

Author 2019-10-26 16:59:29

img

మహేంద్ర సింగ్ ధోని టీమ్ ఇండియా జట్టుకు దాదాపు 15 ఏళ్లపాటు సేవలు అందించాడు. 2019 వరల్డ్ కప్ తరువాత ప్రస్తుతం క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు. ప్రపంచకప్ తరువాత ధోని కొన్ని రోజులపాటు ఆర్మీలో పనిచేయాలని నిర్ణయం తీసుకోవడంతో వెస్ట్ ఇండీస్ టూర్ కు దూరమయ్యాడు. కాగా, స్వదేశంలో సఫారీలతో జరిగిన మ్యాచ్ లకు ధోనిని దూరంగా ఉంచారు. ఇప్పుడు బాంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ లకు కూడా ధోనిని సలెక్ట్ చేయలేదు.

దీంతో ధోని పని అయిపోయిందని, రిటైర్మెంట్ ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. దీనిపై రవిశాస్త్రి స్పందించాడు. ధోని గురించి విమర్శించే హక్కు ఎవరికీ లేదని, ధోనికి ఎప్పుడు రిటైర్ కావాలి అనే విషయం ఆయనకు తెలుసునని, ధోని ఆ స్వేచ్ఛను సంపాదించుకున్నారని అన్నారు. కాగా, ధోని తిరిగి మైదానంలోకి అడుగుపెట్టేందుకు తిరిగి సిద్ధం అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఝార్ఖండ్ అండర్ 23 జట్టుతో కలిసి ధోని ప్రాక్టీస్ చేస్తున్నారని, పూర్తిస్థాయి ఫిట్నెస్ సంపాదించుకొని తిరిగి జట్టులోకి అడుగుపెడతారని తెలుస్తోంది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD