ధోనీకి కూతురు సాయం.. (వైరల్ వీడియో)

Mana Telangana

Mana Telangana

Author 2019-10-25 15:52:42

img

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్, ప్రముఖ స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్‌ ధోనికి కార్లన్నా, బైకులన్నా బాగా ఇష్టం. ఎంతో సింపుల్ గా ఉండే ధోని ఇటీవలే ‘నిసాన్‌ జొంగా’ జీప్‌ ను కొనుగోలు చేశాడు. తన జీప్ ను ధోనీ కడుగుతుంటే ఆయన కూతురు జీవా తండ్రికి తనవంతు సాయం చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీపావళి పండగను పురస్కరించుకొని కార్లను శుభ్రం చేసే పని పెట్టుకున్నాడు. ఓ క్లాత్ తీసుకుని వాహనాన్ని తుడుచుకునే పనిలో ఉండగా… తండ్రికి సాయం చేయడానికి తన బుజ్జి చేతులతో జీబా కూడా కదిలింది. ‘పెద్ద పనికి చిన్న సాయం… ఎప్పటికీ ప్రత్యేకమే’ అనే క్యాప్షన్ తో ధోనీ ఈ వీడియోను నెట్టింట్లో షేర్ చేశాడు. అయితే ఈ వీడియోకి  గంటలోనే 7 లక్షలకు పైగా వ్యూస్, వేలకు పైగా కామెంట్లు వస్తున్నాయి. కాగా మేమూ వచ్చి సాయం చేస్తామని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD