ధోనీని కాపీ కొట్టిన పాక్ కెప్టెన్ సర్ఫరాజ్

Asianet News

Asianet News

Author 2019-10-03 11:47:43

img

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని.. పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ కాపీ కొట్టారు. అచ్చం ధోనీ చేసినట్లే సర్ఫరాజ్ కూడా చేశాడు. శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో పాక్ క్రికెటర్ కి సర్ఫరాజ్ సహాయం చేశాడు. కాగా... దీనికి సంబంధించిన ఫోటోని ఐసీసీ ట్వీట్ చేసింది.

ఇంతకీ మ్యాటరేంటంటే... సోమవారం పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50ఓవర్లలో ఏడు వికెట్ల స్థానానికి 305 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన శ్రీలంక 28 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో జయసూర్య(96), దసన్ శనక(68) బ్యాటింగ్ కి దిగారు.

ఆట ఆసక్తికరంగా సాగుతున్న సమయంలో 34వ ఓవర్ లో జయసూర్య తీవ్రమైన వెన్ను నొప్పితో కిందపడ్డాడు. దీంతో వెంటనే స్పందించిన పాక్ కెప్టెన్ సర్ఫరాజ్.. జయసూర్య వద్దకు వెళ్లి కాళ్లను వెనక్కి వంచి సహాయం చేశాడు. దీనిని ఐసీసీ ట్వీట్ చేసింది.

అయితే... 2015లో ధోనీ కూడా అచ్చం ఇలానే దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ కు సహాయం చేశాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ధోనీని కాపీ కొట్టాడంటూ అభిమానులు ట్వీట్లు చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా... సర్ఫరాజ్ సహాయం చేసిన తర్వాత జయసూర్య తిరిగి తన ఆటను కొనసాగించాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN