ధోనీ కంటే దేశమే ముఖ్యం!

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-01 05:43:18

img

న్యూఢిల్లీ: ధోనీ లక్ష్యంగా భారత జట్టు మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ మరోసారి విమర్శలు గుప్పించాడు. టీమిండియాలో అతడి పాత్ర ఏమిటో సెలెక్టర్లు ముందుగా తెలుసుకోవాలని సూచించాడు. ఒక వ్యక్తి గురించి కాకుండా దేశం గురించి ఆలోచించడం ముఖ్యమని స్పష్టం చేశాడు. వన్డే వరల్డ్‌కప్‌ ముగిశాక ధోనీ మళ్లీ బ్యాట్‌ చేతపట్టలేదు. అతడి రిటైర్మెంట్‌పై ఓవైపు జోరుగా కథనాలు వినిపిస్తుండగా, అతను రెండు నెలలపాటు విశ్రాంతి తీసుకుని ఆర్మీలో సేవలందించాడు. ఇక బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు కూడా దూరంగా ఉండనున్నట్టు సమాచారం. ‘రిటైర్మెంట్‌ అనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం. ఎప్పటి వరకు ఆడాలనిపిస్తే అంత వరకు ఆడేందుకు అనుమతిస్తారు. కానీ ఓసారి భవిష్యత్‌ గురించి కూడా ఆలోచించాలి. నాకైతే వచ్చే వన్డే ప్రపంచక్‌పలో ధోనీ ఆడతాడని అనిపించడం లేదు. అందుకే నాలుగైదేళ్ల కోసం ఇప్పటి నుంచే జట్టు యువ ఆటగాళ్లను తయారు చేసుకోవాలి. అప్పటికి కెప్టెన్‌గా ఎవరున్నా సరే ఈ ఆటగాడు జట్టుకు సరిపోడని చెప్పే ధైర్యం ఉండాలి. ఎందుకంటే అంతిమంగా ధోనీ గురించి కాకుండా దేశం గురించి ఆలోచించడం ముఖ్యం. రిషభ్‌ పంత్‌ లేక సంజూ శాంసన్‌లలో ఒకరికి అవకాశం ఇవ్వాలి’ అని గంభీర్‌ తేల్చి చెప్పాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN