ధోనీ తప్పుకుంటేనే మేలు గవాస్కర్ వ్యాఖ్య

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-09-21 03:07:00

న్యూఢిల్లీ: ధోనీ రిటైర్మెంట్‌పై రోజుకో వార్త ప్రాచుర్యంలోకి వస్తూనే ఉంది. ఆటకు వీడ్కోలు పలుకుతాడా లేక కొనసాగుతాడా అన్నదానిపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. అయితే ధోనీకి ఇక సమయం అయిపోయిందని, తొలిగించే దాకా చూడకుండా అతనే వీడ్కోలు పలుకుతే బాగుంటుందని మాజీ కెప్టెన్ గవాస్కర్ అన్నాడు. మహీని తిరిగి జట్టులోకి తీసుకోకుండా టీమ్‌ఇండియా భవిష్యత్తుపై దృష్టి పెడితే మంచిదని సన్నీ సూచించాడు. ధోనీ, పంత్‌లో తన తొలి ప్రాధాన్యం యువ క్రికెటర్‌కేనని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుంటే నా తొలి చాయిస్ మాత్రం పంత్. ఒకవేళ అవకాశాలను పంత్ సద్వినియోగ చేసుకోకపోతే మంచి ఆప్షన్ శాంసన్ అని గవాస్కర్ అన్నాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN