ధోనీ భవితవ్యంపై దాదా తాజా కామెంట్

Nava Telangana

Nava Telangana

Author 2019-10-17 09:44:00

హైదరాబాద్‌ : భారత జట్టు మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ ఈనెల 23న బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా కీలక బాధ్యతలను చేపట్టబోతున్నాడు. ఈ నేపథ్యంలో గంగూలీ ఈ నెల 24న సెలక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయబోతున్నాడు. భారత మాజీ కెప్టెన్ ధోనీ గురించి సెలక్టర్ల అభిప్రాయం తెలుసుకున్న తర్వాత ధోనీతో కూడా మాట్లాడతానని గంగూలీ చెప్పాడు. ఈ సమావేశంలో సెలక్టర్లతో పాటు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. కొన్ని నిబంధనల్లో మార్పులతో భారత జట్టు కోచ్ రవిశాస్త్రి అందుబాటులో ఉండకపోవచ్చని దాదా తెలిపాడు.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN