ధోనీ రిటైరయ్యాడా ?

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-22 05:27:40

img

కరాచీ: తన భర్త సర్ఫ్‌రాజ్‌ అహ్మద్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడమేగాక.. కనీసం జట్టులో కూడా చోటు కల్పించకపోవడంపై అతడి భార్య ఖుష్బత్‌ తీవ్ర ఆవేదన చెందుతోంది. ఈనెల 31న ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న పాక్‌ టెస్ట్‌, టీ20 జట్లలోనూ సర్ఫ్‌రాజ్‌కు చోటు దక్కలేదు. దీంతో అతడు రిటైర్‌ కావాలన్న సందేశాన్ని పాకిస్థాన్‌ సెలెక్టర్లు ఇచ్చారన్న వ్యాఖ్యలు మొదలయ్యాయి. అయితే 32 ఏళ్ల తన భర్తకంటే ఎంతో పెద్దవాడైన ధోనీ (38) ఇంకా రిటైర్‌ కాలేదని ఖుష్బత్‌ గుర్తు చేసింది. ‘సర్ఫ్‌రాజ్‌ ఎందుకు రిటైర్‌ కావాలి. అతడికి 32 ఏళ్లే. ధోనీ వయస్సు ఎంతో తెలుసా. అయినా అతడు రిటైరయ్యాడా?’ అని తన భర్తపై విమర్శలు గుప్పిస్తున్న వారిని ఓ ఇంటర్వ్యూలో ఆమె ప్రశ్నించింది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD