ధోనీ.. యమ డేంజర్‌!

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-23 05:03:16

img

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీ ఇంటర్నెట్‌ సెర్చ్‌లో అత్యంత ప్రమాదకర వ్యక్తిగా మారిపోయాడు. అతడి గురించి నెట్‌లో వెతుకుతున్నప్పుడు ప్రమాదకర మాల్‌వేర్‌, అశ్లీల వెబ్‌సైట్‌ లింక్‌లకు ఎక్కువగా రీడైరెక్ట్‌ అవుతున్నట్టు సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ మెకాఫీ తెలిపింది. ఆన్‌లైన్‌ సెర్చ్‌లో ప్రమాదకర సెలబ్రిటీల జాబితాలను మెకాఫీ విడుదల చేసింది. ఇందులో ధోనీ తర్వాత సచిన్‌ టెండూల్కర్‌ రెండో స్థానంలో, బిగ్‌బాస్‌-8 విన్నర్‌ గౌతమ్‌ గులాటీ, బాలీవుడ్‌ బాంబ్‌ సన్నీ లియోన్‌ నాలుగో స్థానంలో ఉన్నారు. షట్లర్‌ సింధు కూడా డేంజరస్‌ సెలబ్రిటీల్లోకి చేరిపోయింది. తమ ఫేవరెట్‌ స్టార్ల సమాచారం ఫ్రీగా తెలుసుకునేందుకు నెటిజన్లు పైరేటెడ్‌ సైట్లలో ఎక్కువగా సెర్చ్‌ చేయడంతో సైబర్‌ ముప్పు పెరుగుతోందని మెకాఫీ తెలిపింది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD