నంబర్‌వన్ చేరువలో కోహ్లీ

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-15 08:16:00

img
దుబాయ్: టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ..టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ ర్యాంక్ తిరిగి అధిరోహించేందుకు మరింత చేరువయ్యాడు. దక్షిణాఫ్రికాతో పుణెలో జరిగిన రెండో టెస్టులో అజేయ డబుల్ సెంచరీ ద్వారా కోహ్లీ తన పాయింట్లు మెరుగుపర్చుకున్నాడు. ఐసీసీ సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్(937) తర్వాత కోహ్లీ(936) రెండో ర్యాంక్‌లో నిలిచాడు. ఈ ఇద్దరి మధ్య కేవలం పాయింట్ తేడా ఉంది. వరుస సెంచరీలతో అదరగొడుతున్న యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్(657)ఎనిమిది ర్యాంక్‌లు మెరుగుపర్చుకుని 17వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. చతేశ్వర్ పుజార(817), రహానే(721) వరుసగా నాలుగు, తొమ్మిది ర్యాంక్‌ల్లో ఉన్నారు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఆసీస్ స్పీడ్‌స్టర్ ప్యాట్ కమ్మిన్స్(908) టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా, బుమ్రా(818), అశ్విన్ (792) మూడు, ఏడు ర్యాంక్‌ల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల విభాగంలో టీమ్‌ఇండియా నుంచి జడేజా (414), అశ్విన్(328) రెం డు, ఐదు ర్యాంక్‌ల్లో నిలిచారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN