నాకు ఎవరు సహకరించలేదు యువరాజ్ సింగ్ ఆవేదన

AP5pm

AP5pm

Author 2019-09-28 13:32:55

imgThird party image reference


2014 వరల్డ్ కప్ లో మంచి ప్రదర్శన చేసి నాకు 2017 ఛాంపియన్ ట్రోఫీ తర్వాత ఎనిమిది అవకాశాలు వచ్చాయి అందులో రెండు మ్యాన్ ఆఫ్ ది మ్యాచులు కూడా సాధించాను. కానీ టీమ్ మేనేజ్మెంట్ నాకు ఏమీ సహకరించలేదు. యువకులకు అవకాశం ఇవ్వాలి అనుకున్నట్లుగా నాకు చెప్పలేదు. ఏమీ చెప్పకుండానే నన్ను టీమ్ నుంచి తొలగించారు దానికి ఏవేవో సాకులు చెప్పారు గానీ అందులో ఎటువంటి నిజం లేదు. యోయో టెస్ట్ పాసైన దాన్నే సాకుగా చూపుతూ జట్టు నుంచి తొలగించడం నాకు బాధగా అనిపించింది అని యువరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. యువ క్రీడాకారులను అవకాశం ఇవ్వాలి అనుకున్నప్పుడు తనతో ఒక మాట చెప్పి ఉంటే నా అభిప్రాయం కూడా తెలియజేసే వాడిని కానీ టీమ్ మేనేజ్మెంట్ ఎటువంటి నిర్ణయం నాతో పంచుకోపోవడంతో అర్ధాంతరంగా క్రికెట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని బాధపడ్డాడు. నేను నా కష్టం మీద ఈ స్థాయికి వచ్చాను నాకు ఎవరు గ్రాడ్ ఫాదర్స్ లేరు. నా విషయంలోనే కాదు టీం మేనేజ్మెంట్ సెహ్వాగ్ గంభీర్ విషయంలో ఇలానే చేసింది సీనియర్స్ అంటే కనీస గౌరవం కూడా ఇవ్వడంలేదని తెలియజేశాడు. అప్పటినుంచి ఇప్పటివరకు నాలుగో స్థానం కోసం అనేక మార్పులు చేసిన టీం మేనేజ్మెంట్ కి సరైన ప్లేయర్ దొరక్కపోవడం వాళ్ల పనితీరును తెలియజేసిందని అభిప్రాయపడ్డాడు

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN