నాకౌట్ ఫీవర్ పోవాలి : గంగూలీ

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-16 02:55:00

కోల్‌కతా: ఐసీసీ టోర్నీల్లో నాకౌట్ మ్యాచ్‌ల్లో ఓడిపోయే ట్రెండ్‌ను తిరగరాసి, కోహ్లీ సారథ్యంలోని టీమ్‌ఇండియా టైటిల్స్ సాధిస్తుందని ఆశిస్తున్నట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐకి కాబోయే అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పాడు. భారత్ మంచి జట్టు. అయినా పెద్ద టో ర్నీలు గెలువడం లేదని నాకు తెలుసు. సెమీఫైనల్, ఫైనల్ తప్ప టోర్నీ అంతా టీమ్‌ఇండియా బాగా ఆడుతున్నది. విరాట్ సారథ్యంలోని జట్టు ఈ పరిస్థితిని మారుస్తుందని ఆశిస్తున్నా. కోహ్లీ ఓ చాంపియన్ ప్లేయర్ అని గంగూలీ మీడియాతో మంగళవారం అన్నాడు. 2013 చాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత్ ఒక్క ఐసీసీ టోర్నీలోనూ విజేతగా నిలువలేదు. స్వదేశంలో జరిగిన 2016 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో విండీస్‌పై.. 2017 చాంపియన్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో ఓడింది. అలాగే ఈ ఏడాది జరిగిన ప్రపంచ కప్ సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిన సంగతి తెలిసిందే.

సమయమొచ్చినప్పుడు మాట్లాడుతా
ప్రతి మూడేండ్లకోసారి వన్డే ప్రపంచకప్, ప్రతి ఏడాది టీ20 ప్రపంచకప్ నిర్వహించాలన్న ఐసీసీ ఆలోచనలపైనా గంగూలీ స్పందించాడు. ఆ నిర్ణయం ఐసీసీ తీసుకోవాలి. ఈ ప్రతిపాదనలపై జరిగే చర్చల్లో అవకాశం వస్తే కచ్చితంగా మాట్లాడుతా. కొన్నిసార్లు జీవితంలో కొన్ని తక్కువగా ఉంటేనే బాగుంటాయనిపిస్తుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఫుట్‌బాల్ ప్రపంచకప్ నాలుగేండ్లకోసారి జరుగుతుంది. అప్పుడు ఎంత సందడి నెలకొంటుందో అందరికీ తెలిసిందే అని సౌరవ్ చెప్పాడు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD