నార్త్‌ఈ్‌స్టను గెలిపించిన గ్యాన్‌

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-27 05:45:53

img

నార్త్‌ఈస్ట్‌ స్టార్‌ స్ట్రయికర్‌ అసమోహ్‌ గ్యాన్‌ ఆట చివర్లో చేసిన హెడర్‌ గోల్‌తో ఆ జట్టు 2-1తో ఒడిషాపై గెలుపొందింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆట ప్రారంభమైన రెండో నిమిషంలోనే మిడ్‌ ఫీల్డర్‌ రిడీమ్‌ లాంగ్‌ గోల్‌ చేసి నార్త్‌ఈ్‌స్టను ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత కూడా నార్త్‌ఈస్ట్‌ అదే దూకుడును కొనసాగించినా తొలి అర్ధభాగంలో మరో గోల్‌ను సాధించలేకపోయింది. రెండో అర్ధభాగంలో ప్రత్యర్థి స్కోరును సమం చేయడానికి శతవిధాలా ప్రయత్నించిన ఒడిషా పోరాటం 71వ నిమిషంలో మార్కోస్‌ కొట్టిన గోల్‌తో ఫలించింది. ఆ తర్వాత ఇరు జట్లూ ఆధిపత్యం కోసం హోరాహోరీగా తలపడ్డాయి. మరో ఆరు నిమిషాల్లో మ్యాచ్‌ ముగుస్తుందనగా గ్యాన్‌ చేసిన హెడర్‌ గోల్‌ గేమ్‌ను నార్త్‌ఈస్ట్‌ వైపు తిప్పింది. చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న నార్త్‌ఈస్ట్‌ విజేతగా నిలిచింది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN