నాలుగో వికెట్‌ కోల్పోయిన దక్షిణాఫ్రికా…

Amaravatinews

Amaravatinews

Author 2019-10-04 13:05:05

img

Share this on WhatsApp

విశాఖపట్నం:టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా నాలుగో వికెట్‌ కోల్పోయింది. ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌లో నైట్‌ వాచ్‌మెన్‌ బవుమా(18; 26 బంతుల్లో 3×4) ఎల్బీగా వెనుతిరిగాడు. 39/3తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఎల్గర్‌ (36 బ్యాటింగ్‌), బవుమా నిలకడగా ఆడారు. ఈ క్రమంలో 27వ ఓవర్‌ వేసిన ఇషాంత్‌ తొలి బంతికే నైట్‌ వాచ్‌మెన్‌ను పెవిలియన్‌ చేర్చాడు. దీంతో దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌ బ్యాటింగ్‌కు వచ్చాడు. 28 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు 64 పరుగులు చేసింది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD