నాలుగో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా

Nava Telangana

Nava Telangana

Author 2019-10-13 14:21:00

పుణె: పుణె వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ నాలుగో రోజు రెండో ఇన్నింగ్‌లో సౌతాఫ్రికా వెంట వెంటనే మరో రెండు వికెట్లు కోల్పోయింది. 54 బంతులు ఆడిన డు ప్లెస్సిస్‌ 5 పరుగులు చేసి ఔట్‌ అయ్యాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో ప్లెస్సి సాహాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అలాగే 72 బంతులు ఆడిన ఎల్గర్ 48 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అశ్విన్ బౌలింగ్ లో ఎల్గర్ ఉమేష్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 25.5 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. డీకాక్‌ (0), బవుమా (1) క్రీజులో ఉన్నారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN