నాలుగో స్థానంలో ఆడడానికి సిద్ధమంటున్న రైనా….

Amaravatinews

Amaravatinews

Author 2019-09-27 17:09:45

img

Share this on WhatsApp

ఇంటర్నెట్‌డెస్క్‌:టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ సురేశ్‌ రైనా తనకు అవకాశమిస్తే క్రికెట్‌లో నాలుగో స్థానంలో ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నాడు. వరుసగా రెండు టీ20 (2020, 2021) ప్రపంచకప్‌లు రాబోతున్నందున తాను నాలుగో స్థానంలో ఆడతానని, గతంలో అదే స్థానంలో బ్యాటింగ్‌ చేసిన అనుభవముందని చెప్పాడు. గత నాలుగేళ్లుగా టీమిండియా ఆ స్థానంలో ఎంతో మంది ఆటగాళ్లని పరీక్షించినా ప్రపంచకప్‌లో అంబటి రాయుడు ఆ స్థానాన్ని ఆశించాడు. అయితే అతడికి నిరాశ కలిగిస్తూ జట్టు యాజమాన్యం విజయ్‌శంకర్‌ని ఎంపిక చేసింది.

ఈ నేపథ్యంలో విజయ్‌శంకర్‌ గాయం కారణంగా తప్పుకోగా యువ క్రికెటర్‌ రిషభ్‌పంత్‌కు అవకాశం దక్కింది. ప్రపంచకప్‌ తర్వాత కూడా పంత్‌ విఫలమౌతుండటంతో అనేక విమర్శలకు గురవుతున్నాడు. ఈ సందర్భంగా అతడి బ్యాటింగ్‌పై స్పందించిన రైనా.. ‘పంత్‌ తన సహజసిద్ధమైన బ్యాటింగ్‌ చేయలేకపోతున్నాడు. ఆ స్థానంలో ఎలా ఆడాలో అతడికి అర్థంకావడం లేదు. స్పష్టత కోల్పోయి ఔటైపోతున్నాడు. అయితే ధోనీ ఆటగాళ్లతో కూర్చొని మాట్లాడే విధంగా ఎవరైనా పంత్‌తో చర్చించాలి. క్రికెట్‌ అనేది మానసికమైన ఆట. అతడు ధాటిగా ఎలా ఆడతాడో అలాగే కొనసాగనివ్వాలి. ఎవరో ఆంక్షలు పెట్టినట్లు ఆడటం వల్ల అతడు రాణించలేకపోతున్నాడు’ అని అన్నాడు.

అలాగే టీమిండియాకి ధోనీ సేవలు ఇంకా అవసరమని, వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్‌కి ధోనీ అవసరం ఎంతో ఉందన్నాడు. ధోనీ ఇంకా ఫిట్‌గా ఉండడంతోపాటు అద్భుత వికెట్‌ కీపర్‌ అని, అత్యుత్తమ ఫినిషర్‌ కూడా అని రైనా వివరించాడు. 2018లో ఇంగ్లాండ్‌పై ఆఖరి మ్యాచ్‌ ఆడిన రైనా వన్డేల్లో 5,615 పరుగులు చేయగా టీ20ల్లో 1,605 పరుగులు చేశాడు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD