నావల్లే గంభీర్‌ కెరీర్‌ ముగిసింది !

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-08 05:26:22

img

కరాచీ: గౌతమ్‌ గంభీర్‌ తన బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో విఫలమవడం వల్లే వైట్‌బాల్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలకాల్సి వచ్చిందని పాకిస్థాన్‌ పేసర్‌ మహ్మద్‌ ఇర్ఫాన్‌ చెప్పుకొచ్చాడు. 2012లో పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా జరిగిన వన్డేలు, టీ20లలో ఇర్ఫాన్‌ నాలుగుసార్లు గంభీర్‌ను అవుట్‌ చేశాడు. అనంతరం ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీ్‌సలో మాత్రమే గంభీర్‌ ఆడాడు. ఆపై జట్టులో చోటు కోల్పోయాడు. ‘నా బౌలింగ్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ సౌకర్యంగా కనిపించలేదు. నేను ఎంతో పొడగరిని కావడంతో నా బంతులను అర్థం చేసులేకపోయామని 2012లో భారత్‌లో పర్యటన సందర్భంగా ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌ కొందరు నాకు చెప్పారు’ అని 7.1 అడుగుల పొడగరి అయిన ఇర్ఫాన్‌ అన్నాడు. ‘మ్యాచ్‌లోనే కాదు, రెండు జట్ల ప్రాక్టీస్‌ సందర్భంగా కూడా నాకు ఎదురుపడేందుకు గంభీర్‌ ఇష్టపడేవాడు కాదు. 2012 సిరీ్‌సలో నేను అతడిని నాలుగుసార్లు అవుట్‌ చేశా. దాంతో అతడు నాపట్ల అసహనంగా ఉండేవాడు’ అని ప్రస్తుతం పాక్‌ జట్టులో చోటు కోల్పోయిన ఇర్ఫాన్‌ చెప్పాడు. అయితే ఇర్ఫాన్‌ వ్యాఖ్యలపై గంభీర్‌ అభిమానులు విరుచుకుపడ్డారు. ఫిక్సింగ్‌ కళంకితుడివి నీవా గంభీర్‌ కెరీర్‌కు ముగింపు పలికిందని దుయ్యబట్టారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD