నా జీవితంలో అదే కీలక మలుపు: యువీ

Nava Telangana

Nava Telangana

Author 2019-09-27 11:52:00

ముంబై: యోయో టెస్టు పూర్తిచేసినా జట్టులో తనకు అవకాశం ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించిందని టీమిండియా ఆల్‌టైమ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌సింగ్‌ పేర్కొన్నాడు. 36 ఏళ్ల వయసులో తాను ఆ పరీక్షలో నెగ్గుకొస్తానని జట్టు యాజమాన్యం భావించలేదని యువీ తెలిపాడు. అలాగే యువకులకు అవకాశాలివ్వాలనుకుంటున్న విషయాన్ని కూడా తనతో చర్చించలేదని వాపోయాడు. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత తాను ఆడిన 8 మ్యాచ్‌ల్లో రెండుసార్లు మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైనా.. జట్టు నుంచి తనని తప్పిస్తారని ఊహించలేదన్నాడు. ఆ సమయంలో తనకు గాయమైనప్పుడు శ్రీలంకతో సిరీస్‌కు సన్నద్ధమవ్వాలని యాజమాన్యం పేర్కొందని వెల్లడించాడు.
అప్పుడే యోయో టెస్టు అమల్లోకి వచ్చిందని గుర్తు చేసుకున్న యువీ.. అదే తన జీవితాన్ని మలుపు తిప్పిందని పేర్కొన్నాడు. 36 ఏళ్ల వయసులో ఆ టెస్టు పాస్‌ కాలేనని భావించిన యాజమాన్యం, ఆ కారణంతో తనని పక్కనపెట్టాలని భావించిందని చెప్పాడు. ఈ నేపథ్యంలోనే తాను పరీక్ష పూర్తిచేసినా దేశవాళీ క్రికెట్‌లో కొనసాగాలని చెప్పారన్నాడు. జట్టులో యువకులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్న విషయాన్ని సీనియర్‌ క్రికెటర్లు అయిన సెహ్వాగ్‌, జహీర్‌ లేదా తనతో ఏ ఒక్కరూ ప్రస్తావించలేదని యువీ నిట్టూర్చాడు. టీమిండియాలో ఇలా జరగడం సరికాదని, ఈ విషయంలో తనని తాను సమర్థించుకొని, అన్నింటికీ సమయమొస్తుందని భావించానని పేర్కొన్నాడు.

img
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD