నా తప్పు రోహిత్‌ చేయకూడదు వీవీఎస్‌ లక్ష్మణ్‌

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-09-29 06:23:00

img
న్యూఢిల్లీ: అసమాన ఆటతీరుతో టెస్టు ల్లో టీమ్‌ఇండియా కు ఎన్నో విజయా లు అందించిన హై దరాబాదీ ైస్టెలిష్‌ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌... టెస్టుల్లో ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించాడు. తనను టెస్టుల్లో ఓపెనింగ్‌ చేయమన్నప్పుడు టెక్నిక్‌ను మార్చుకున్నానని, అది ప్రతికూల ప్రభావం చూపిందని చెప్పాడు. రోహిత్‌ ఆ తప్పు చేయకుం డా.. తన సహజశైలిలోనే ఆడాలని సూచించాడు. ‘ఇప్పటికే ఎక్కువ అం తర్జాతీయ అనుభవం ఉండడం రోహిత్‌కు పెద్ద అనుకూలాంశం. నేను ఓపెనింగ్‌ చేయాల్సి వచ్చినప్పుడు అంతకు ముందు నాలుగు టెస్టులే ఆడా. రోహిత్‌ 12ఏళ్లుగా అం తర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. అందుకే అతడికి పరిణితి, అనుభవం ఉంది.

అలాగే ఫామ్‌లోనూ ఉన్నాడు. టెక్నిక్‌ మార్చుకొని ఆడినందున ఓపెనర్‌ గా నేను రాణించలేకపోయా. ఆ తర్వాత తప్పులను సరిదిద్దుకొని మిడిలార్డర్‌లో విజయవంతమయ్యా. సహజసిద్ధమైన ఆటను ఎక్కువగా మార్కుకొని ఊహించినంతగా ఫలితాలు రాకపోతే రిథమ్‌ దెబ్బతింటుంది. రోహిత్‌ రిథమ్‌ ప్రకారం ఆడే ప్లేయర్‌ కావడంతో మరింత ఇబ్బంది అవుతుంది. అందుకే సహజ శైలిలో ఆడితేనే మంచిది’ అని లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డాడు. 1996-98 మధ్య కొన్ని టెస్టు ల్లో లక్ష్మణ్‌ ఓపెనర్‌గా వచ్చి ఆకట్టుకోలేకపోయాడు. అయితే ఆ తర్వాత మిడిల్‌ఆర్డర్‌లో అద్భుతమైన ఆట తో కీలక ప్లేయర్‌గా మారి జట్టుకు ఎన్నో విజయాలు అందించిన విషయం తెలిసిందే. వచ్చే నెల 2న ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌లో రోహిత్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు.
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD