నా పేరు లాగొద్దు

Mana Telangana

Mana Telangana

Author 2019-11-01 02:44:05

img

న్యూఢిల్లీ: మీ అభిప్రాయాలను సంచలనాత్మకంగా మార్చుకునేందుకు నా పేరును లాగొద్దని భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి సతీమని, ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మ సూచించారు. ఇటీవల ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో కొంత మంది సెలెక్టర్లు స్టేడియంలో కోహ్లి భార్య అనుష్కకు టికప్పులు అందజేశారని భారత మాజీ క్రికెటర్ ఫరూక్ ఇంజినీర్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై అనుష్క ఘాటుగా స్పందించారు. సంచలనం కోసం నా పేరు లాగొద్దని స్పష్టం చేశారు.

కొందరికి ప్రచారం కోసం నా పేరును వాడు కోవడం అలవాటుగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రపంచకప్‌లో తాను కేవలం ఒక మ్యాచ్‌కు మాత్రమే హాజరయ్యానని, అది కూడా ఫ్యామిలీ బాక్స్‌లో ఉండి చూశానని వివరించారు. అంతేగాక తనకు కొంత మంది సెలెక్టర్లు టి, కాఫీలు అందించారని ఆరోపించడం మంచి సంస్కృతి కాని హితవు పలికారు. ఇప్పటికైనా తనను వివాదంలోకి లాగడాన్ని ఆపుకోవాలని అనుష్క కోరారు.

Leave Me Out Of It Says Anushka Sharma

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN