నిఖత్‌తో బౌట్‌కు భయపడను

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-20 06:37:44

img

న్యూఢిల్లీ: ‘నిఖత్‌ జరీన్‌తో తలపడేందుకు భయపడడంలేదు’ అని దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ స్పష్టంజేసింది. వచ్చే ఫిబ్రవరిలో చైనాలో ఒలింపిక్‌ క్వాలిఫయర్‌ టోర్నీ జరగనుంది. ఇందులో మహిళల 51 కిలోల విభాగంలో తలపడే బాక్సర్‌ కోసం మేరీకోమ్‌-నిఖత్‌ జరీన్‌ మధ్య ట్రయల్‌ బౌట్‌ ఉండదని బాక్సింగ్‌ సమాఖ్య (బీఎఫ్‌ఐ) పేర్కొంది. ఇటీవల రష్యాలో జరిగిన వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో కాంస్య పతకం గెలుపొందిన మేరీకోమ్‌నే చైనా పోటీలకు పంపనున్నట్టు ప్రకటించింది. దాంతో వివాదం రాజుకుంది. ఈ నేపథ్యంలో మేరీకోమ్‌ స్పందిస్తూ ‘నన్ను చైనా పంపాలన్న నిర్ణయం బీఎ్‌ఫఐ తీసుకుంది.

వారు తీసుకున్న నిర్ణయం ప్రకారం నడుచుకోవాలి. నిబంధనలను నేను మార్చలేను. నిఖత్‌ను ఎదుర్కొనేందుకు నేను బెదరడం లేదు’ అని పేర్కొంది. ‘శాఫ్‌ గేమ్స్‌లో ఆమెను ఎన్నోసార్లు ఓడించా. అయినా నన్ను సవాలు చేసేలా మాట్లాడడంలో అర్థముందా. ఒలింపిక్స్‌లో ఎవరు పతకం గెలుస్తారో బాక్సింగ్‌ సమాఖ్యకు తెలుసు’ అని చెప్పింది. మరోవైపు బాక్సింగ్‌ సమాఖ్య పారదర్శకంగా వ్యవహరించాలంటూ.. మేరీ-నిఖత్‌ వివాదాన్ని సాధ్యమైనంత సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని క్రీడలమంతి కిరణ్‌ రిజిజు సూచించారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD