నిరూపించుకున్న .. అంబటి రాయుడు..

Navyamedia

Navyamedia

Author 2019-07-11 10:34:25

img

అంబటి రాయుడు మరోసారి సత్తా చాటాడు. హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన రాయుడు.. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా కర్ణాటకతో నిన్న జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును అలవోకగా విజయ తీరాలకు చేర్చాడు. 111 బంతులు ఎదుర్కొన్న రాయుడు 4 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 87 పరుగులు చేశాడు. దీంతో హైదరాబాద్ జట్టు 21 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. హైదరాబాద్ బౌలర్ సందీప్ 35 పరుగులిచ్చి 4 వికెట్లు నేలకూల్చి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

హైదరాబాద్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన కర్ణాటక 45.2 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌట్తో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఓపెనర్ దేవదత్త (60), కెప్టెన్ మనీశ్ పాండే (48) తప్ప ఆ జట్టులో ఎవరూ పెద్దగా రాణించలేదు.READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN