నెం.4లో బ్యాటింగ్ చేస్తానని నమ్మకముంది: రైనా

10 TV News Channel

10 TV News Channel

Author 2019-09-27 16:51:44

img

టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా జట్టులో స్థానంపై నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు. అంతేకాకుండా టీ20 వరల్డ్ కప్‌లో 2020, 2021కి జట్టులో నెం.4స్థానంలో తాను ఆడతానని విశ్వాసాన్ని కనబరిచాడు. చివరిసారిగా 2018లో ఇంగ్లాండ్ పర్యటనలో ఆడిన సురేశ్ రైనా తాను ప్రదర్శన సంతృప్తికరమైన ప్రదర్శన చేశానని చెప్పుకొచ్చాడు. 

'భారత్‌కు నెం.4స్థానంలో బ్యాటింగ్ చేయగలను. గతంలోనూ అదే స్థానంలో బ్యాటింగ్ చేసి నిరూపించుకోగలిగానరు. రాబోయే టీ20 వరల్డ్ కప్‌లో రాణించగలననే నమ్మకంతో ఉన్నా' అని జట్టులో తన స్థానంపై విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. 

వన్డే వరల్డ్ కప్ 2019లో అనూహ్యంగా విజయ్ శంకర్‌కు గాయం కావడంతో నెం.4స్థానం పంత్‌ను వరించింది. రిషబ్ ఆ స్థానంలో ఫెయిలయ్యాడని విమర్శలు వస్తుండటంతో వాటిపై రైనా ఇలా స్పందించాడు. 'క్రికెట్ అనేది మైండ్ గేమ్. పంత్ షాట్ సెలక్షన్ కుదరడం లేదని విమర్శలు వస్తున్నాయి. అతనెవరో సూచనలతో క్రికెట్ ఆడాలనుకుంటున్నాడు. మన ఆలోచనతో ఆడితేనే సాధించగలం. ఈ విషయంలో కాస్త అయోమయానికి గురయ్యాడని అనుకుంటున్నా. తన స్టైల్ వదిలేసి సింగిల్స్, డిఫెన్స్ ఆడేందుకే ప్రయత్నిస్తున్నాడు' అని రైనా విశ్లేషించాడు. 

'ఇంకా ఎంఎస్ ధోనీ గురించి చెప్పాలంటే ఆయన ఇంకా ఫిట్‌గానే ఉన్నాడు. అతని సూచనలతో ఆడడానికి మేం సిద్ధంగా ఉన్నాం. వికెట్ కీపింగ్‌లో, మ్యాచ్ ఫినిషింగ్‌లోనూ అదే దూకుడుతో ఉన్నాం. రాబోయే టీ20 వరల్డ్ కప్‌కు భారత్‌కు ధోనీ ఓ బలం లాంటివాడు' అని వివరించాడు. 

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN