నెదర్లాండ్స్‌పై ఐర్లాండ్ విజయం

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-10-06 06:20:50

ఒమన్, అక్టోబర్ 5: నెదర్లాండ్స్‌తో శనివారం జరిగిన రెండో టీ20లో ఐర్లాండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయ 167 పరుగులు చేసింది. బెన్ కూపర్ (65), మ్యాక్స్ ఒడౌడ్ (38) రాణించారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అదీర్, క్రెయగ్ యంగ్ చెరో రెండు వికెట్ల పడగొట్టగా, బైడ్ రాంకిన్ 1 వికెట్ తీసుకున్నాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్ జట్టు మరో 8 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హ్యారీ టెక్టర్ (47), అండ్రూ బల్బరైన్ (32), గరెత్ డెలనీ (29) రాణించారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN