నేటి నుంచి ఆసిస్, శ్రీలంక టీ20 సిరీస్

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-10-27 04:58:42

img

అడిలైడ్, అక్టోబర్ 26: ఇంగ్లాండ్‌తో యాషెస్ సిరీస్ తర్వాత ఆస్ట్రేలియా జట్టు తమ సొంత గడ్డపై శ్రీలంకతో టీ20 సిరీస్‌లో తలపడనుంది. మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం అడిలైడ్ వేదికగా మొదటి మ్యాచ్ జరగనుంది. బాల్ ట్యాంపరింగ్ తర్వాత చాలారోజులకు పొట్టి ఫార్మాట్‌కు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ బరిలోకి దిగనున్నారు. ఇటీవల జరిగిన యాషెస్ సిరీస్‌లో స్టీవ్ స్మిత్ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. మరోవైపు శ్రీలంక జట్టు కూడా అంచనాలకు మించి ఆకట్టుకుంటోంది. గత పర్యటనలో పాకిస్తాన్ వెళ్లేందుకు సీనియర్ ఆటగాళ్లు నిరాకరించినా, జూనియర్ జట్టు సత్తా చాటింది. ఆ సిరీస్‌లో పాకిస్తా న్ జట్టును ఏకంగా క్లీన్‌స్వీప్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే ఊపులో లంక జట్టు ఆస్ట్రేలియాను ఢీకొనేందుకు సిద్ధమైంది.
*చిత్రం...టీ20 ట్రోఫీతో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్, శ్రీలంక కెప్టెన్ లసిత్ మలింగ

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN