నేటి నుంచి టెస్ట్ స‌మ‌రం

Prajasakti

Prajasakti

Author 2019-10-02 10:29:18

img

* ఓపెనర్లుగా రోహిత్‌-సాహా
* నేటి నుంచి భారత్‌-దక్షిణాఫ్రికా టెస్ట్‌ మ్యాచ్‌
ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో:
విశాఖ నగర పరిధి పిఎం.పాలెంలోని ఎసిఎ-విడిసిఎ క్రికెట్‌ స్టేడియం వేదికగా బుధవారం ఉదయం ప్రారంభమయ్యే భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే తొలి టెస్ట్‌ మ్యాచ్‌కు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రాక్టీస్‌ చేసేందుకు ముందుగా భారత జట్టు మైదానానికి చేరుకుంది. కెప్టెన్‌ విరాట్‌ కొహ్లీ, రోహిత్‌ శర్మ, జడేజా, ఇషాంత్‌ శర్మ, ఉమేష్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌, హనుమ విహారి తదితర క్రీడాకారులు మధ్యాహ్నం వరకు నెట్‌ ప్రాక్టీస్‌ చేశారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయానికి సౌత్‌ ఆఫ్రికా జట్టు మైదానానికి చేరుకుంది. సౌత్‌ ఆఫ్రికా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ డి.కాక్‌, కె.రబడా, సిలండర్‌, మార్కర్‌ క్రీడాకారులు సాయంత్రం వరకు నెట్‌ ప్రాక్టీస్‌చేశారు. ఎన్నడూ లేని విధంగా బుధవారం నుంచి ఆదివారం వరకూ జరిగే టెస్ట్‌ సిరీస్‌ మ్యాచ్‌లను ఉచితంగా తిలకించేందుకు క్రీడా అభిమానులైన విద్యార్థులకు వారి ఐడెంటిటీ కార్డు ద్వారా ఉచిత ప్రవేశం గేటు నెంబర్‌ ఎనిమిది నుంచి ప్రవేశం కల్పిస్తున్నారు. ఈ మ్యాచ్‌కి సంబంధించి టికెట్లు కూడా ఆన్‌లైన్లో అమ్మకాలు మొదటలో అంత ఆశాజనకంగా లేకపోయినా మంగళవారం మధ్యాహ్నం నుంచి అమ్మకాలు జోరుగా సాగాయి.

వృద్ధిమాన్‌ సాహాకు చోటు - టీమిండియా కెప్టెన్‌ విరాట్‌
దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్టుకు తుది జట్టులో వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహాకు అవకాశం కల్పించాలని నిర్ణయించాం. 34 ఏళ్ల సాహా గాయం కారణంగా చాలాకాలం జట్టుకు దూరంగా ఉన్నాడు. గతేడాది దక్షిణాఫ్రికా టూరులో ఒక టెస్టు మ్యాచ్‌ ఆడి గాయం కారణంగా జట్టు నుంచి వైదొలిగాడు. జట్టులో చేరిన రిషబ్‌ పంత్‌ ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో రాణించి సాహా స్థానాన్ని భర్తీ చేశాడు. అయితే వెస్టీండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లకు సాహా తిరిగి జట్టులో చేరినా ఆడే అవకాశం రాలేదు. ప్రస్తుతం అతను ఫిట్‌గా ఉన్నాడు. టెస్టు క్రికెట్‌కు సాహా తగిన వికెట్‌ కీపర్‌, తిరిగి జట్టులోకి రావడానికి ఇది సరైన సమయం అని నా అభిప్రాయం' అని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నారు. మంగళవారం ఎసిఎ-విడిసిఎ మైదానంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ టెస్టుకు ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ ఆడే అవకాశం ఉందన్నారు. వన్డేల్లో మిడిల్‌ ఆర్డర్‌ నుంచి ఓపెనర్‌గా వచ్చి అద్భుతంగా రాణిస్తున్నాడు

ఛాలెంజ్‌గా తీసుకున్నాం
- దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లిసెస్‌
'ఈ సిరీస్‌ మాకు చాలా కీలకం. చాలెంజ్‌గా తీసుకుని ఆడాల్సి ఉంది. తొలి బ్యాటింగ్‌కు భారీ స్కోరు చేసే అవకాశాలున్నాయి. ఆల్‌రౌండర్లతో కలిపి ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగుతున్నాం. ఇక్కడి పిచ్‌లపై భారత్‌ స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తారు. స్పిన్నర్లును సమర్థవంతంగా ఎదుర్కోవాల్సి ఉంది.

భారత జట్టు: విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), అజింక్యా రహానె, రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌, పుజరా, హనుమ విహారి, అశ్విన్‌, జడేజా/కుల్దీప్‌, సాహా (వికెట్‌కీపర్‌), ఇషాంత్‌/ఉమేష్‌, మహ్మద్‌ షమి.

దక్షిణాఫ్రికా జట్టు: డుప్లెసిస్‌(కెప్టెన్‌), మరక్రమ్‌, ఎల్గర్‌, బ్రుయాన్‌, బవుమా, డికాక్‌(వికెట్‌ కీపర్‌), హంజా, ఫిలాండర్‌, కేశవ్‌ మహరాజ్‌, రబడా, ఎన్గిడి, పిడిట్‌, క్లేశన్‌, నూర్టే ్జ, ముత్తుసామి.

పొంచివున్న వర్షం ముప్పు
నేటినుంచి విశాఖలో ప్రారంభం కానున్న తొలిటెస్ట్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉంది. అంతేగాక మ్యాచ్‌ జరిగే ఐదురోజులూ వర్షం కురిసే అవకాశమున్నట్లు ఇక్కడి వాతావరణశాఖ తెలిపింది. దీంతో తొలిటెస్ట్‌ జరిగే ఎసిఏ-విడిసిఏ మైదానంలోని పిచ్‌ను పూర్తిగా కవర్లతో కప్పివేశారు. ఒకవేళ వర్షం వచ్చి ఆగిపోతే కేవలం రెండు గంటల్లోనే మ్యాచ్‌కు సిద్ధం చేసేలా రెండు సూపర్‌ సాపర్‌ యంత్రాలనూ సిద్ధంగా ఉంచారు. అంతేగాక ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లు 50% అమ్మకాలు పూర్తయినట్లు నిర్వాహకులు తెలియజేశారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN