నేటి నుండి భారత్- దక్షిణాఫ్రికాల టెస్ట్ సిరీస్

Ntvtelugu

Ntvtelugu

Author 2019-10-01 12:00:15

img

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు టీమిండియా సిద్దమయింది. విశాఖ వేదికగా జరుగనున్న తొలి టెస్ట్‌ లో బోణి కొట్టాలని కోహ్లీ సేన బరిలోకి దిగుతుండగా స్వదేశంలో తిరుగులేని టీమిండియాకు ఎలాగైనా చెక్ పెట్టాలని ప్రోటీస్ పక్కా వ్యూహంతో బరిలోకి దిగుతోంది. ఇటీవల ముగిసిన మూడు టీ20 సిరీస్‌ని 1-1తో సమం చేసిన సఫారీలు టెస్ట్‌ల్లో కోహ్లీ సేనకు టఫ్‌ ఫైట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు.

భారత పర్యటనకి చివరిగా 2015లో వచ్చిన దక్షిణాఫ్రికా టెస్టుల్లో 3-0తొ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఓ రకంగా చెప్పాలంటే ఆ సిరీస్‌ లో ఓటమి సౌతాఫ్రికా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. అప్పటి నుంచి సఫారీల ప్రదర్శన నానాటికి దిగజారుతూ వస్తోంది. అయితే అప్పటికి ఇప్పటికి ఆ జట్టు ప్రదర్శనలో ఏమాత్రం తేడా లేదు. అయినప్పటికి ఈసారీ భారత్ ను తమ సొంత గడ్డపైనే ఓడించాలని మొక్కోవొని పట్టుదలతో ఉన్నారు సఫారీలు.

ముఖ్యంగా సౌతాఫ్రికా తమ పేస్‌ను నమ్ముకుని ఈ సారీ బరిలోకి దిగుతోంది. విశాఖ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలించనుంది కాబట్టి సఫారీలు ఎంతమేరకు భారత బ్యాటింగ్‌కు కళ్లేం వేయగలరు అన్నది చూడాలి. ఇక బ్యాటింగ్‌లో సఫారీలు డుప్లెసిస్‌, డికాక్‌ ,మకరమ్‌లపైనే ప్రధానంగా ఆధారపడుతుండటం, నిలకడ లేమి ఆ జట్టు మైనస్‌లు. ఇక ఎంతటి జట్టును అయిన మట్టికరిపించగల సత్తా టీమిండియాది. బ్యాటింగ్‌లో కోహ్లీ, పుజారా, రహానే ల నిలకడ టీమిండియాను ఇన్నాళ్లు విజయలా బాట పట్టించింది.

ఇప్పడు కూడా ఈ ముగ్గిరిపైనే భారత్ ఆదారపడనుంది. అయితే ఈ సిరీస్‌తో ఓపెనర్ అవతారం ఎత్తనున్న రోహిత్ శర్మ ఎలా రాణిస్తాడోనని అందరు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో డకౌట్ అయినప్పటికి రోహిత్ పై టీం మెనేజ్‌మెంట్ గట్టి నమ్మకంతోనే ఉంది. వన్‌డేలో మాదిరిగానే టెస్ట్‌లో కూడా రోహిత్ ఓపెనర్‌గా క్లిక్ అయితే టీమిండియాకు ఓపెనింగ్ సమస్య తీరినట్లే.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN