నేడు విశాఖకు రానున్న టీమిండియా ఆటగాళ్లు

Andhrajyothy

Andhrajyothy

Author 2019-09-28 08:46:53

విశాఖపట్నం: ఇక్కడి ఏసీఏ వీడీసీఏ స్టేడియం లో అక్టోబరు 2 నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న తొలి టెస్టులో తలపడే భారత్‌ ఆటగాళ్లు శనివారం నగరానికి రానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ముంబైనుంచి రహానే, హైదరాబాద్‌ నుంచి గిరీష్‌ దోంగ్రీ, సాయంత్రం 5.30 గంటలకు ఢిల్లీ నుంచి షమిందర్‌ సిద్ధు, విక్రమ్‌ రాహోర్‌, చతేశ్వర పుజారా, రిషబ్‌ పంత్‌, మహ్మద్‌ షమీ, చెన్నై నుంచి అశ్విన్‌ రవిచంద్ర విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 6.50 గంటలకు హైదరాబాద్‌ నుంచి హనుమాన్‌ విహారి, ఆర్‌. శ్రీధర్‌ వస్తారు. వీరికి నోవాటెల్‌లో బస కల్పిస్తున్నారు.

కెప్టెన్‌ కోహ్లీ రాక రేపు

ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ముంబై నుంచి వచ్చే విమానంలో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ నగరానికి చేరుకుంటాడు. మిగిలిన ఆటగాళ్లలో కులదీప్‌ యాదవ్‌, నితిన్‌ పటేల్‌, షబ్నం గిల్‌, సాహా సాయంత్రం నగరానికి చేరుకుంటారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN